కావలసినవి:
చికెన్ లెగ్స్ – 4
అలంకరణకు ఉల్లి చక్రాలు
మారినేట్ చేసుకోవటానికి కావలసినవి –
సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్
అల్లం రసం – 2 టేబుల్ స్పూన్
మిఠాయి రంగు – చిటికెడు
వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ – 2 టీ స్పూన్స్
ఉప్పు – రుచికి తగినంత
మిరియాలపొడి – 1/4 టీ స్పూన్
కారం – 1/2 టేబుల్ స్పూన్
చికెన్ మసాలా పొడి – 1 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం :
చికెన్ లెగ్స్ మారినేట్ చేసుకోవటం కోసం తీసుకున్న పదార్ధాలన్నీ కలిపి
తయారు చేసుకున్న మిశ్రమంలో చికెన్ లెగ్స్ ను 1/2 గంట నానబెట్టాలి.
మారినేట్ చేసిన చికెన్ లెగ్స్ ను మైక్రో ఓవెన్ గ్రిల్ లో రెండువైపులా తిప్పుతూ
10 నిమిషాలు గ్రిల్ చేయాలి.గ్రిల్ చేసుకున్న చికెన్ లెగ్స్ నాన్ స్టిక్ పాన్ లో వేసి dry గా అయ్యేంతవరకు,ముక్క మెత్తబడే వరకు వేయించాలి.తేనె,సాస్ వేగుతున్న చికెన్ లెగ్స్ పై పోసి,5 నిమిషాలు సన్నని మంటపై వేయించాలి.వీటిని ఉల్లి చక్రాలతో కలిపి బిర్యానిలో తింటే చాలా బాగుంటుంది.
Leave a Reply