చికెన్-మంచూరియన్

కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్‌: 500grms
ఉల్లిపాయలు: 3 కట్ చేసినవి
వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చిమిర్చి: 4(చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసినవి)
సోయాసాస్‌: 1tsp‌
చైనా సాల్ట్‌: 1/2tsp‌
మిరియాలపొడి: 1tsp
వెనిగర్‌: 1tsp‌
కొత్తిమీర తరుగు: 1/2cup

సాస్‌ కోసం:
మిరియాల పొడి: 1/2tsp
చైనా సాల్ట్‌: 1/2tsp‌
చికెన్‌ స్టాక్‌: 1/2cup
కార్న్‌ఫ్లోర్‌: 1tsp‌
మైదాపిండి: 2tsp
సోయాసాస్‌: 1tsp‌
పంచదార: 1tsp‌
టమాటా సాస్: 1tsp‌
అజినమోటో: చిటికెడు
ఉల్లికాడలు: 4
వెల్లుల్లి ముక్కలు: 1tsp‌

తయారు చేసే విధానం:
1. మొదటగా కార్న్‌ఫ్లోర్‌, మైదాపిండి, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్‌, సోయాసాస్‌ లను కలిపి… అందులో కడిగిన చికెన్‌ ముక్కల్ని వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అరగంట నాననివ్వాలి.
2. ఇప్పుడు పాన్ లో నూనె వేడిచేసి ఈ చికెన్‌ ముక్కల్ని మెత్తగా వేయించి ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో కొంచెం నూనె వుంచుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు, సోయాసాస్‌, పంచదార, చికెన్‌ స్టాక్‌, టమాటా సాస్‌, ఉప్పు, మిరియాల పొడి, అజినమోటో వేసి కలపాలి.
4. కొద్దిగా చిక్కబడిన తర్వాత ముందు వేయించి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు అందులో వేసి ఆ మిశ్రమం ముక్కలకు పట్టేవరకు కలపాలి. చికెన్ ముక్కలు సాస్ తో కలిసిపోయి థిక్ నెస్ గా మారి మంచురియన్ చికెన్ రెడీ అవుతుంది. అంతే కొద్దిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొంటే రుచికరమైన చికెన్‌ మంచూరియా రెడీ.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *