చికెన్ తో ఎన్నోవెరైటీలు.వాటిలో స్పైసీగా నోరూరించే ఐటం ఈ పకోడీలు.
చికెన్ మారినేట్ చేసి ఉంచుకుంటే చేయడం చాలా తేలిక.పదినిమిషాల్లో
వేడిగా రెడీ అయిపోతాయి.చల్లని వర్షపు సాయంత్రాలకు పర్ ఫెక్ట్ జోడీ.
కావలసిన పదార్ధాలు ;
బోన్ లెస్ చికెన్ పావుకిలో
అల్లంవెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్
గరం మసాల పొడి ఒక టీ స్పూన్
ఉప్పు,కారం తగినంత
పసుపు కొంచెం
పచ్చిమిర్చి రెండు
కొత్తిమీర ఒక కట్ట
కరివేపాకు ఒక రెమ్మ
ఉల్లి కాడలు రెండు టేబుల్ స్పూన్స్
శనగపిండి రెండు టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్
నూనె
తయారు చేసే విధానం:
చికెన్ ముక్కల్లో అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాల పొడి,ఉప్పు,కారం,
పసుపు వేసి కలిపి ఒక గంటసేపు మారినేట్ చేసుకోవాలి.
ఇందులో సన్నగా తరిగిన మిర్చి,ఉల్లికాడలు,కొత్తిమీర,శనగపిండి,
కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం నీరు చల్లి కలుపుకోవాలి.బాటర్ లాగ అక్కర్లేదు
జస్ట్ చికెన్ ముక్కలకు కోట్ అయితే చాలు.కాగిన నూనెలో చికెన్ ముక్కలు వేసి వేయించి తీసుకోవాలి.అదే నూనెలో కరివేపాకు కూడా వేయించుకోవాలి.చికెన్ పకోడీలపై వేయించిన కరివేపాకు చల్లి వేడిగా సర్వ్ చేయడమే.
Leave a Reply