కావలసినవి:
చికెన్ – 500 గ్రా//
ఉల్లిపాయలు – 150 గ్రా//
మిర్చిపొడి – 50 గ్రా//
పసుపు – 1/2 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్లు
గరంమసాల పొడి – 1 స్పూన్
కొబ్బరి పొడి – 2 స్పూన్లు
కొబ్బరి గసగసాల పేస్ట్ – 50 గ్రా//
టమాటాలు – 3
పెరుగు – 1/4 కప్పు
నూనె – తగినంత
లవంగాలు – 3
యాలకులు – 2
తయారు చేసే విధానం:
చికెన్ కావాల్సిన సైజ్ లో కోసి,శుభ్రంగా కడిగి దానికి పసుపు ,కారం,
అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక గంట నాననివ్వాలి.
నూనెను వేడి చేసి అందులో టమాటా ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు,
కొంచెం ఉప్పు వేసి దోరగా వేయించుకోవాలి.దానిలో చికెన్ మిశ్రమాన్ని వేసి వుడకనివ్వాలి.ఇందులో పెరుగు వేసి,10 నిమిషాలు వుడకనివ్వాలి.
తర్వాత గరం మసాల,కొబ్బరి గసగాసాలా పేస్ట్,ధనియాలపొడి వేసి
సన్నని మంట మీద 10 నిమిషాల పాటు వుడకనివ్వాలి.తర్వాత కొబ్బరిపొడి కలుపుకుని,2 నిమిషాలు ఉడకనిచ్చి తీసేయాలి.
Leave a Reply