కావలసినవి :
చికెన్ – 500 గ్రా//
అల్లంవెల్లుల్లి – 2 టీ స్పూన్స్
కారం – 2 టీ స్పూన్స్
పచ్చిమిర్చి – 3
చికెన్ మసాలా – 2 టీ స్పూన్స్
ఉల్లిపాయ పేస్ట్ – 3 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్
అల్లం ముక్కలు – 2 టీ స్పూన్స్
పెరుగు – 1 కప్పు
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
కరివేపాకు – రెండు రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
తయారు చేసే విధానం:
శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని,అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,కారం,ఉప్పు,పెరుగు,చికెన్ మసాలా పొడి వేసి బాగా కలిపి 1/2 గంట నానబెట్టాలి.
తరవాత బాణలిలో నూనె వేసి స్టవ్ మీద పెట్టి నూనె కాగిన తర్వాత,సన్నగా తరిగిన అల్లం ముక్కల్నివేయించుకుని,ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్,పచ్చిమిర్చి తరుగు,కరివేపాకు వేసిబాగా ఎర్ర రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
ఇందులో మారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని వేసి బాగా కలియబెట్టి సన్నని మంట మీదఉడికించుకోవాలి.ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో జీడిపప్పు పేస్ట్ వేసి ఉడికించుకోవాలి.చివరిగా దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి.
ఇది అన్నం లోకి బాగుంటుంది.
Leave a Reply