కావలసిన పదార్ధాలు:
నానబెట్టడానికి
చికెన్ పావుకిలో
పెరుగు ఒక కప్పు
అల్లంవెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూను
గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూను
మిర్చి రెండు
పుదీనా కొంచెం
ఉప్పు,కారం తగినంత
పసుపు అర టీ స్పూను
నూనె ఒక టేబుల్ స్పూను
బిరియానీకి
బాస్మతి రైస్ ఒక గ్లాసు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి రెండు
పుదీనా అర కప్పు
కొత్తిమీర అర కప్పు
ఉప్పు తగినంత
నూనె మూడు టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూను
గరం మసాలా పొడి ఒక టీ స్పూను
నెయ్యి రెండు టీ స్పూన్లు
బిరియాని మసాలకి (షాజీర,అనాస పువ్వు,జాపత్రి,మరాటీ మొగ్గ,
లవంగాలు.దాల్చిన చెక్క, యాలకులు,బిరియానీ ఆకు)
తయారు చేసే విధానం:
ముందుగా పెరుగులో అన్నీ కలిపి మిశ్రమం తయారుచేసి, చికెన్
ముక్కలు అందులో వేసి కనీసం రెండుగంటలు నాననివ్వాలి. మూడు,
నాలుగు గంటలైన సరే.ఎంత ఎక్కువ నానితే అంత బావుంటుంది.
బియ్యం కూడా కడిగి ఇరవై నిమిషాలు నానబెట్టాలి.
ఒక పెద్ద గిన్నెలో రెండు స్పూన్లు నూనె వేసి వేడి చేసి,అన్నీ రెండు
రెండు చొప్పున బిరియానీ మసాలా,కొంచెం షాజీర వేసి దోరగా
వేయించాలి.ఇప్పుడు వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి ఎర్రగా వేయించాలి ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా,కొత్తిమీర ,అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాల పొడి వేసి సన్నని సెగపై వేయించాలి.ఇందులో అర
లీటరు నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి.
నీళ్ళు మరుగుతుండగా నానబెట్టిన బాస్మతి బియ్యం ఇందులో
వేయాలి.ఈ లోగా ప్రెషర్ పాన్ తీసుకుని అందులో రెండు స్పూన్లు నూనె వేసి అడుగున రెండు బిరియానీ ఆకులు పెట్టి దానిపై నానబెట్టిన చికెన్ ను
పాన్ అంత పరచుకునేలా సర్దాలి. కొంచెం పుదీనా కొత్తిమీర ,చికెన్ పైన
వెయ్యాలి బియ్యం మూడు వంతులు ఉడకగానే నీరు వడపోసి ఆ బియ్యాన్ని ఈ చికెన్ పై వేసి సమంగా పరవాలి.ఇప్పుడు మరికొంచెం పుదీనా,కొత్తిమీర,రెండు స్పూన్ల నెయ్యి పైన వెయ్యాలి.
ఇష్టం ఉన్నవారు ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ గా డీప్ ఫ్రై చేసి
వేసుకోవచ్చు.ఉంటే గోరువెచ్చని పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు
వెయ్యాలి.(ఈ రెండూ ఆప్షనల్ ). లేకపోయినా పరవాలేదు
ఇప్పుడు పాన్ మూతపెట్టి చిన్న స్టవ్ మీద ఉంచి వెయిట్ పెట్టాలి.ఒక
విజిల్ రాగానే సిమ్ లో పెట్టెయ్యాలి రెండో విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్
చేసెయ్యాలి.స్టీం అంతా పోయాక మూత తీసి జాగ్రత్తగా కలిపి సర్వ్ చేస్తే
ఘుమఘుమలాడే చికెన్ బిరియాని నోరూరిస్తుంది.
Leave a Reply