చికెన్ పులావ్ (chicken pulav)

చికెన్ బిర్యానీ చేయడం కొంచెం కష్టమైన పని అయితే ఈ పులావ్

చేయడం చాలా తేలిక.అన్నీ రెడీ చేసుకుంటే పావుగంటలో 

అయిపోతుంది.చల్లచల్లని వెదర్ లో స్పైసీగా నోరూరిస్తుంది.

కావలసిన పదార్ధాలు:

బాస్మతి రైస్                   ఒక గ్లాస్ 

చికెన్                            పావుకిలో 

ఉల్లిపాయ                     ఒకటి 

పచ్చిమిర్చి                   మూడు 

టమాటాలు                   రెండు 

కొత్తిమీర                        ఒక కట్ట 

పుదీనా                         ఒక కట్ట

పెరుగు                        రెండు టీ స్పూన్స్ 

గరంమసాలాపొడి             రెండు టీ స్పూన్స్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్              రెండు టీ స్పూన్స్ 

ఉప్పు,పసుపు,కారం,నూనె  

మసాలాదినుసులు 

లవంగాలు,చెక్క,యాలకులు,మరాటీ మొగ్గ ,అనాసపువ్వు,జాపత్రి,

బిర్యానీ ఆకు.

తయారు చేసే విధానం:

బియ్యం కడిగి ఒక అరగంట నబెట్టుకోవాలి.పుదీనా,కొత్తిమీర,పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.పెరుగులో అల్లంవెల్లుల్లి పేస్ట్,ఒక టీస్పూన్ గరంమసాల పొడి,పుదీనా పేస్ట్,కొద్దిగా ఉప్పు,పసుపు,కారం వేసి బాగా కలిపి చికెన్ వేసి కలిపి ఒక అరగంట నాననివ్వాలి.నూనె వేడిచేసి మసాలా దినుసులు వేసి వాలికలుగా కోసిన ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.

ఇప్పుడు తరిగిన టమాటాముక్కలు వేసి ఇవి ఉడికిన తరువాత చికెన్ 

మిశ్రమం వేసి కలపాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత ఒక స్పూన్ మసాలాపొడి వేసి కలిపి తగినన్ని నీళ్ళు,ఉప్పు వేయాలి. నీరు మరుగుతుండగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి 

మూడు విజిల్స్ రానివ్వాలి. రెడీ అయిన చికెన్ పులావు ను ఒకసారి కలిపి పెరుగు చట్నీతో వడ్డించాలి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *