కావలసిన పదార్థాలు :
చికెన్ వింగ్స్ – 12
చికెన్ కైమా – 150గ్రా
గరం మసాలా – 2గ్రా
కొత్తిమీర – 5గ్రా
ఉప్పు – తగినంత
రిఫైండ్ ఆయిల్ – తగినంత
కార్న్ ఫ్లోర్ – 40గ్రా
శాఫ్రాన్ – 1గ్రా
నీరు – 100 మి.లి
తయారు చేసే పద్ధతి :
కోడి రెక్క మాంసం తీసుకొని కడిగి ఒక చివర ఎముక బయటకు వచ్చేలా చెక్కి వుంచాలి. చికెన్ కైమా, గరం మసాలా, తరిగిన కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు కలిపి ఉంచాలి. కార్న్ ఫ్లోర్, శాఫ్రాన్, నేరు కలిపి ముద్ద చేసి ఉంచాలి. కైమా, గరం మసాలా, కొత్తిమీర, అల్లం, కారం, ఉప్పు అన్నీ కలిపి ముద్ద చేసి ముక్కలకు పట్టించి తర్వాత కార్న్ ఫ్లోర్ ముద్దలో ముంచి నిండు నూనెలో వేయించాలి.
Leave a Reply