వంకాయలు – 2 పెద్దవి
చికెన్ – పావుకిలో
వెల్లుల్లి రేకలు – 10
టమాటాలు – పావుకిలో
కారం – 4 టీ స్పూన్లు
ధనియాలపొడి – 1 టీ స్పూన్
మిరియాల పొడి – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
కొత్తిమీర – 2 కట్టలు
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీ స్పూన్
నూనె – సరిపడా
వంకాయ చికెన్ తయారుచేసే విధానం
చికెన్ వేయించి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో సరిపడా నూనె వేసి బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, చికెన్ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి సన్నని మంటపై మెత్తగా ఉడికించాలి. నీరంతా పోయాక దించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి మధ్యగా కోసిన వంకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో వెల్లుల్లి రేకలు, టమాటా గుజ్జు వేసి బాగా వేయించాలి. ఉప్పు,కారం, వేయించిన చికెన్ వేసి సన్నమంట మీద పావుగంట ఉడికించి దించేయాలి. ఈ కూరని వంకాయ ముక్కలపై వేసి అలంకరించుకోవాలి.
Leave a Reply