తయారు చేయు విధానము:
1. మొదటగా చికెన్ శుభ్రం చేసుకొని ఒక బౌల్ లో వేసి అందులో టమోటో పేస్ట్, జీలకర్ర పొడి, దనియా పౌడర్, మరియు ఉప్పు వేసి బాగా కలిపి ఒక గంట పాటు అలాగే పక్కన పెట్టాలి.
2. తర్వాత మిక్సర్ లో పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు, చెక్క, లవంగం, యాలకులు మరియు మొంతులు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
4. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఫై వేయించాలి.
5. ఇప్పుడు ముందుగా టమోటో పేస్ట్ తో నానబెట్టిన చికెన్ ను అందులో వేసి 10 నిమిషాల పాటు బాగా వేయించాలి.
6. ఇప్పుడు చికెన్ పీస్ వేగుతున్న సమయంలో మసాల ముద్దను వేసి బాగా మిక్స్ చేసి బాగా కలుపుతూ తక్కువ మంట మీద వేయించాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి మరో పదినిమిషాల పాటు వేయించాలి.
7. అంతే గ్రీన్ చిల్లి చికెన్ రెడీ. ఉల్లిపాయ, కీరకాయ(కుకుంబర్), ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయడమే ఆలస్యం. రోటీలకు మంచి కాంబినేషన్.
Leave a Reply